ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి జనసేనాని చిత్తూరు పర్యటన - తిరుపతిలో పవన్ కల్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేటి నుంచి ఐదు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం తిరుపతి, చిత్తూరు.. మంగళవారం కడప, రాజంపేట.. బుధవారం మదనపల్లె.. గురువారం హిందూపురం, అనంతపురం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.

pawan kalyan chittore tour starts frow today
నేటి నుంచి జనసేనాని చిత్తూరు పర్యటన

By

Published : Dec 1, 2019, 9:41 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేటి నుంచి ఐదు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా నేడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని... అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కడప జిల్లా రైల్వేకోడూరు వెళ్తారు. రాత్రికి తిరుపతి చేరుకుని అక్కడే బస చేస్తారు.

పర్యటన ఇలా...

సోమవారం తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలతో తిరుపతిలో పవన్​ సమావేశమవుతారు.
మంగళవారం కడప, రాజంపేట.. బుధవారం మదనపల్లె.. గురువారం హార్స్​లీ హిల్స్​లో హిందూపురం, అనంతపురం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.

ఇవీ చదవండి:

భాష, సంస్కృతికీ నష్టం కలిగిస్తే... దేశ సమగ్రతకు ముప్పే'

ABOUT THE AUTHOR

...view details