ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పవన్​కు ఎందులోనూ స్పష్టత ఉండదు: ఎమ్మెల్సీ రామచంద్రయ్య - tdp party news

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్​కు ఏ అంశంపైనా స్పష్టత లేదని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. "ఆయన తెదేపా అధినేత చంద్రబాబు కోసం పని చేయడం ఆంధ్ర ప్రజలకు నచ్చడం లేదు" అన్నారు.

పవన్​కు దేనిపైనా స్పష్టం ఉండదు : ఎమ్మెల్సీ రామచంద్రయ్య
పవన్​కు దేనిపైనా స్పష్టం ఉండదు : ఎమ్మెల్సీ రామచంద్రయ్య

By

Published : Apr 8, 2021, 10:07 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​కి ఏ విషయంపైనా స్పష్టత ఉండదని వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి ప్రెస్ క్లబ్​లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన రామచంద్రయ్య.. పవన్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'ఆయన ఒక ఎంటర్​టైనర్ మాత్రమే'

పవర్ స్టార్ పవన్ కేవలం ఎంటర్​టైనర్ మాత్రమేనన్న రామచంద్రయ్య.. రాజకీయ నాయకుడి లక్షణాలు ఆయనలో కనిపించడం లేదని చెప్పారు.

'దిల్లీ వెళ్లొచ్చి మాట మార్చారు'

విశాఖ ఉక్కు కోసం కేంద్రంతో పోరాడతానన్న పవన్ దిల్లీకి వెళ్లొచ్చి.. దేశ ప్రయోజనాల కోసమేనంటూ మాట మార్చారని ఎమ్మెల్సీ విమర్శించారు. జనసేనాని వ్యవహారశైలి నచ్చకనే ఆ పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు కోసం జనసైనికులు పని చేస్తున్నారని.. ఇది ప్రజలకు నచ్చడంలేదని అన్నారు.

ఇవీ చూడండి:

షాపింగ్ కాంప్లెక్స్​ జీఓ సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details