ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగస్టు 11 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమలలో పవిత్రోత్సవాలు మొదలు కానున్నాయి. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అర్చకులు తెలిపారు.

తిరుమలలో మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు

By

Published : Jul 30, 2019, 10:36 AM IST

తిరుమలలో మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు 10వ తారీఖున అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ...సిబ్బంది వల్ల గానీ తెలిసీ, తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

మొదటి రోజున పవిత్రాల ప్రతిష్ట, రెండవరోజు పవిత్ర సమర్పణ, ఆఖరి రోజున పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే మూడురోజుల పాటు విశేష పూజ, అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు.

ఇది చూడండి: అమ్మాయి ఫొటోతో వల... 11 లక్షలు కాజేత

ABOUT THE AUTHOR

...view details