విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో.. రాష్ట్రంలో చేపట్టిన బంద్ ప్రభావం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాక్షికంగా కనిపించింది. తెదేపా, వైకాపా, సీపీఐ, సీపీఎం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీ కాళహస్తి, ఏర్పేడు మండలాల్లో పూతలపట్టు, నాయుడుపేట ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు తరలిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
చిత్తూరులో పాక్షికంగా విశాఖ ఉక్కు బంద్ - చిత్తూరులో బంద్ తాజా వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బంద్ పాక్షికంగా కనిపించింది. తెదేపా, వైకాపా, సీపీఐ, సీపీఎం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
చిత్తూరులో పాక్షికంగా బంద్