ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి సేవలో పండిట్ రవిశంకర్, మోహన్ బాబు - Pandit Ravishankar, Manchu Mohan Babu latest news

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్, సినీ నటుడు మంచు మోహన్ బాబు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

పండిట్ రవిశంకర్
పండిట్ రవిశంకర్

By

Published : Mar 20, 2022, 4:07 PM IST

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్, సినీ నటుడు మంచు మోహన్ బాబు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. నిన్న (శనివారం) చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థ ఆవరణలో నిర్వహించిన మోహన్ బాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రవిశంకర్.. ఇవాళ ఉదయం పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు.

అనంతరం పండిట్ రవిశంకర్​ గురూజీ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం ఆలయం తరఫున తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details