ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులు నాలుగు వారాల్లో తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో గతంలో జారీ చేసిన జీవో 623 స్థానంలో కొత్త రంగులు సూచిస్తూ.. సీఎస్ ఇవ్వనున్న తదుపది ఆదేశాలపై అధికార వర్గల్లో ఆసక్తి నెలకొంది. చిత్తూరు జిల్లాలో సచివాలయ భవనాలకు తెలుపు రంగు వేయించాలని.. జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) సాంబశివారెడ్డి మదనపల్లెలో ఎంపీడీవోలకు సూచించారు. జిల్లా మంత్రి మౌఖిక ఆదేశాలపై చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
రంగుల తొలగింపుపై కసరత్తు - పార్టీ రంగులపై సుప్రీం కోర్టు కామెంట్స్ తాజా వార్తలు
సచివాలయ భవనాలకు వేసిన రంగులు తొలగించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ చర్యలు తీసుకుంటోంది. తదుపరి ఆదేశాలివ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దస్త్రం పంపింది.
panchayathiraj department about removal of party colors