చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి.. గాదంకి టోల్ ప్లాజా వద్ద పాకాలవారిపల్లి గ్రామస్థులు నిరసన చేపట్టారు. ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు తమ భూములు ఇస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పడు మాట తప్పి ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి మండలంలో ఉన్న టోల్ ప్లాజాకు పక్క మండలం పేరుతో బోర్డు ఏర్పాటు చేసి.. పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. దీనిపై పలుమార్లు ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేసినా.. స్పందన లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని.. లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.
గాదంకి టోల్ ప్లాజా వద్ద పాకాలవారిపల్లి గ్రామస్థుల ఆందోళన - villagers Protest at Gadanki Toll Plaza
చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాలవారిపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రోడ్డు విస్తరణకు భూములిచ్చిన తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఇతరులకు కల్పించటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాదంకి టోల్ ప్లాజా వద్ద నిరసన