కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిపి వేస్తూ తీసుకున్న నిర్ణయం కొనసాగుతోంది. వైరస్ కట్టడికి భౌతిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పద్మావతి పరిణయోత్సవాలను సైతం వాయిదా వేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది.
లాక్డౌన్పై ఓ స్పష్టమైన నిర్ణయం వెలువడిన తర్వాత ఆగమ పండితులతో చర్చించిన అనంతరమే పద్మావతి పరిణయోత్సవాలను నిర్వహిస్తామని తితిదే ప్రకటించింది. తిరుమలలో కార్యక్రమాలపై తితిదే తీసుకున్న తాజా నిర్ణయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు.