రైతులు వరి ధాన్యాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ సంస్థకు తరలించేందుకు అవస్థలు పడుతున్నారు. లాక్ డౌన్ ప్రభావంతో ఉదయం 7 గంటల లోపల మాత్రమే ధాన్యాన్ని అభివృద్ధి సంస్థకు తీసుకు రావాలంటూ విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ఈ కారణంగా.. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేకువజామునుంచే ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు బారులు తీరాయి.
లాక్డౌన్: ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది పడుతున్న రైతులు - paddy farmers facing problems to shift paddy bags to center
పండించిన వరిధాన్యాన్ని విత్తనాభివృద్ధి సంస్థకు తరలించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విత్తనాభివృద్ధి కేంద్రానికి తెల్లవారుజామునుంచే వాహనాలతో రైతులు క్యూ కట్టారు.
ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది పడుతున్న రైతులు
TAGGED:
latest news of farmers