ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లెలో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఇద్దరు మృతి - ఒకరు మృతి

చిత్తూరు మదనపల్లెలోని ఓ పారిశ్రామిక సంస్థలో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించారు. మరో వ్యక్తికి గాయాలవ్వటంతో.. ఆస్పత్రికి తరలించారు.

oxygen cylinder blast
oxygen cylinder blast

By

Published : Jun 8, 2021, 9:28 AM IST

Updated : Jun 8, 2021, 12:25 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పేలి.. ఇద్దరు మృతి చెందారు. కొత్త క్రొమోటోగ్రఫీ మెషిన్‌ను ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా.. మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. లింగప్ప, నయాజ్‌బాషా అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు.

ప్రమాదంలో బెంగళూరు నుంచి వచ్చిన టెక్నీషియన్‌ లింగప్ప(42) అక్కడికక్కడే మృతిచెందగా.. పరిశ్రమ యజమాని శివ మహేష్, అక్కడే పనిచేస్తున్న నయాజ్ బాషా(32) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నయీజ్‌ బాషాకు మెరుగైన చికిత్స అందించేందుకు తిరుపతి తరలిస్తుండగా దారిలో ఆయన మృతి చెందారు. ప్రమాదానికి కారణాలపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Jun 8, 2021, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details