ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాక్టికల్స్​ మార్కులు లేకుండానే ఫలితాలు... 250 మంది ఫెయిల్ - undefined

రాయలసీమకే తలమానికమైన తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రాక్టికల్ మార్కులు కలపకుండా డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు ప్రకటించేశారు. వర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరి.... 250మంది విద్యార్థుల భవిష్యత్తును అయోమయంలో పడేసింది.

విద్యార్థులు

By

Published : Aug 21, 2019, 10:16 PM IST

అధికారుల నిర్లక్ష్యం... విద్యార్థులు అయోమయం

తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఖ్యాతి రోజురోజుకు మసకబారుతోంది. నిన్న మొన్నటి వరకు భారత్ ఇన్నోవేషన్స్ అనే సంస్థతో కలిసి ఫలితాల వెల్లడిలో అనేక వివాదాలతో అభాసుపాలైన విశ్వవిద్యాలయం.. ఆ విధానానికి స్వస్తి పలికినా వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. కొత్తగా ఫలితాలను నిర్దేశించేందుకు ఓ సాఫ్ట్​వేర్​ను అందుబాటులోకి తీసుకువచ్చిన వర్సీటీ అధికార బృందం.. నిర్వహణలో మాత్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. తాజాగా డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల వెల్లడిలో బయటకొచ్చిన వాస్తవాలు ఈ ఉదంతాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టికల్ మార్కులను కలపకుండా ఫలితాలను వెల్లడించిన వర్సిటీ అధికారులు... దాదాపు 250మంది విద్యార్థులు పరీక్ష తప్పినట్లు ప్రకటించారు.

వర్సిటీ చూపించిన ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ గోవింద రాజస్వామి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యారు. వారంతా తమకు న్యాయం చేయాలంటూ ఆందోళ బాట పట్టారు. కళాశాల యాజమాన్యాన్ని అడిగితే ప్రాక్టికల్ మార్కులతో సహా అన్ని వివరాలను వర్సిటీకి పంపించామని... అక్కడ తప్పు జరిగితే తమకెలా సంబంధం ఉంటుందంటూ బదులిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఫలితాలు ఇలా వచ్చాయని కళాశాల యజమాన్యాలు అంటున్నాయి. జరిగిన సంఘటనపై విద్యార్థులు ఆందోళన బాట పట్టగా... అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికార వర్గం... సదరు సిబ్బందికి మెమోలు జారీ చేసింది. అయితే విశ్వవిద్యాలయానికి వీసీ సహా పాలకమండలి లేని కారణంగా... ఇంత వివాదం జరుగుతున్నా... వాస్తవాలను వెల్లడించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు.. జరిగిన సంఘటనపై తక్షణం విచారణకు ఆదేశించి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details