అటవీశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తిరుపతిలో నిరసన చేపట్టారు. తిరుపతి పరిసర ప్రాంతాలలో, అటవీశాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ నిరసనలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆదుకోవాల్సింది పోయి.. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా అటవీశాఖలో వివిధ రకాలుగా సేవచేస్తున్నప్పటికీ .. తమకు గుర్తింపు లేదన్నారు.
అటవీశాఖ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన - చిత్తూరు జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
తిరుపతి అటవీశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Outsourcing employees
కరోనా సమయంలోనూ విధులకు హాజరవుతున్నామనీ .. జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : కరోనా పై పోరు..2021 నాటికి వ్యాక్సిన్ వచ్చేనా..?