ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్​

తిరుపతి అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్​ను నిర్వహించారు. తిరుపతిలో సోదాలు చేశారు.

Operation Muskan
తిరుపతి అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్​

By

Published : Oct 28, 2020, 6:04 PM IST

డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్​ను నిర్వహించారు. బాల కార్మికులు, వీధి బాలలు, అనాధ పిల్లలను గుర్తించి వారిని సంరక్షించడమే లక్ష్యంగా... సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో 77 మంది అనాధ పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలను పోలీసులు గుర్తించారు.

తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం వీధి బాలలు, అనాధ పిల్లలను బాల వసతి గృహానికి తరలించారు. చిన్నారుల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలల హక్కుల పరిరక్షణ సైతం తమ బాధ్యతగా తీసుకొని పోలీసులు కృషి చేస్తున్నారని ఎస్​పీ రమేష్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

'అన్నం పెట్టే రైతు చేతులకు సంకెళ్లు వేస్తారా?'

ABOUT THE AUTHOR

...view details