చిత్తూరు జిల్లా మదనపల్లిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్యర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 65వ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 13జిల్లాల నుంచి క్రీడాకారులు మైదానంలో మార్చ్ ఫాస్ట్ చేశారు. విద్యతోపాటు క్రీడారంగంలో పాల్గొని ప్రతిభను చాటుకుని దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకురావాలని వారు ఆకాక్షించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు, నవీన్ చక్రధర్‌లను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని అన్నారు. గేమ్స్‌లో పాల్గొనటం వలన ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్ మూడు రోజులు జరగనుంది.
మదనపల్లిలో 65వ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ - మదనపల్లిలో 65వ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో 65 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
మదనపల్లిలో 65వ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం
TAGGED:
చిత్తూరు జిల్లా