పురపోరుకు తిరుపతిలో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. నామినేషన్ల దాఖలుతోపాటు ఆ తర్వాత వాటి పరిశీలన ప్రక్రియ సమయంలో కొన్ని మున్సిపాలిటీల్లో కొన్ని వార్డుల్లో కేవలం ఒక్క నామినేషనే ఉంది. దాంతో రెండు మున్సిపాలిటీల పరిధిలో 27 వార్డులు ఏకగ్రీవం కానున్నాయి. ఇప్పటికే వీటిపై స్పష్టత వచ్చింది. మిగిలిన చోట్ల ఒక్కో వార్డుకు రెండు, మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపసంహరణకు ఇంకా అవకాశం ఉన్నందున ఎన్ని వార్డులు ఏకగ్రీవమవుతాయనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. గత ఏడాది మార్చిలో నగర, మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. అప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతోపాటు పరిశీలన జరిగింది. కేవలం ఉపసంహరణ పూర్తికావాల్సి ఉండగా ఎన్నికలను వాయిదా వేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. అంటే ఇప్పటికే జరిగిన ఏకగ్రీవాలకు ఆమోదం లభించినట్లే.
కొన్నింటికే ఏకగ్రీవాలు
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో 26 వార్డుల్లో ఇప్పటికే 10 ఏకగ్రీమయ్యాయి. అన్నీ అధికార పార్టీ వారివే.
*ఏకగ్రీవం అయిన వార్డులలో 1,2,7,9,12,20,21,22,23,24 ఉన్నాయి. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డులకు 17 ఏకగ్రీవం కాగా వైకాపా అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఏకగ్రీవం అయిన వార్డుల్లో 2,3,6,8,9,12,13,14,15,16,17,19,20,24,27,30 ఉన్నాయి