ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధ్యాయులకు.. ‘దీక్ష’ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణ - today Online training for teachers through the 'Deeksha' app news update

ప్రాథమిక విద్యను బలోపేతం చేసి బోధనా సామర్థ్యాన్ని ఉపాధ్యాయుల్లో పెంచేందుకు ‘దీక్ష’ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణ అందిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు దీక్షా యాప్‌ ద్వారా శిక్షణ ప్రారంభమైంది. ఓరియంటేషన్‌ ఆన్‌ న్యూ టెక్ట్స్‌బుక్స్‌, ఉయ్‌ లవ్‌ రీడింగ్‌, దీక్ష కంటెంట్‌ క్రియేషన్‌ పేరిట మూడు కోర్సులను అందిస్తున్నారు. ఈ శిక్షణ జూన్‌ ఒకటో తేదీ వరకు కొనసాగుతుంది. జిల్లాలో ఇప్పటికే ఆన్‌లైన్‌ వేదికగా శిక్షణ ప్రారంభమైంది.

ఐదో తరగతి వరకు బోధిస్తున్న వారికి శిక్షణ ప్రారంభం
ఐదో తరగతి వరకు బోధిస్తున్న వారికి శిక్షణ ప్రారంభం

By

Published : May 11, 2021, 4:38 PM IST

బోధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సరికొత్త ఆవిష్కరణలతో 2019 ఆగస్టు 21న ఎన్‌సీఈఆర్టీ నిష్టా రూపొందించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 9,104 మంది ఉపాధ్యాయులు ఈ దీక్షలో శిక్షణ పొందుతున్నారు.

15 రోజుల శిక్షణలో 18 మాడ్యుల్స్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తైతే పాఠ్యపుస్తకాల రూపకల్పన, బోధనా సామర్థ్యం పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఐదో తరగతి వరకు బోధన చేసే ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పాల్గొనాలి, ఆన్‌లైన్‌ ద్వారా లైవ్‌ వీడియోలను చూడాలి. శిక్షణకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు.

కోర్సు-1 : ఈ నెల 7 నుంచి 22 వరకు కొత్త పాఠ్య పుస్తకాల రూపకల్పనకు శిక్షణ. గణితం, ఈవీఎస్‌, ఇంగ్లిషు, తెలుగు సబ్జెక్టుల్లో ఓరియంటేషన్‌ కార్యక్రమం ఉంటుంది.

కోర్సు-2 :మే 23 నుంచి 28 వరకు ఉయ్‌ లవ్‌ రీడింగ్‌

కోర్సు-3 : మే 29 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు దీక్ష కంటెంట్‌ క్రియేషన్‌ రూపకల్పన

ప్రతి ఉపాధ్యాయుడు దీక్షా యాప్‌ను ఆన్‌లైన్‌లో గాని గూగుల్‌ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల మధ్య ఆన్‌లైన్‌ బోధనా తరగతులు ఉంటాయి. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన బోధన వీడియోలను చూడాలి. ప్రతి రోజు శిక్షణా తరగతులూ ఉంటాయి. ఓ రోజు కూడా సెలవు కేటాయించలేదు.

ప్రతి టీచర్‌ పాల్గొనాలి

దీక్ష యాప్‌లో నిర్వహిస్తున్న శిక్షణలో ఒకటి నుంచి ఐదోతరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలి. ప్రాథమిక స్థాయిలో పాఠ్య పుస్తకాల రూపకల్పన చేయడం ద్వారా విద్యను బలోపేతం చేయొచ్ఛు 2019లో నిష్టా కార్యక్రమం ద్వారా మాడ్యుల్స్‌ తయారయ్యాయని సమగ్రశిక్ష ఇన్‌ఛార్జి ఏఎంవో దామోదరరెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:

మంత్రి కొడాలి నానిపై తెదేపా నేతల ఫిర్యాదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details