కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో... చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆన్లైన్లో ఆర్జిత సేవలను ప్రారంభించారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో... దూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వచ్చే పరస్థితి లేకపోవటంతో.. ఆన్లైన్ ద్వారా పరోక్ష ఆర్జిత సేవలను ప్రారంభించారు. అభిషేకాలు, కల్యాణోత్సవం, మృత్యుంజయ జపం, చండీ హోమం, రుద్ర హోమం వంటి పూజలకు ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించి.. గోత్ర నామాలతో పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆన్లైన్లో ఆర్జిత సేవలు ప్రారంభం - srikalahasti online aarjitha sevalu lates news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పరోక్ష ఆర్జిత సేవలను ప్రారంభించారు. కరోనా కారణంగా.. ఆలయానికి రాలేని పరిస్థితులు ఉండటంతో.. ఆన్లైన్ ద్వారా పరోక్ష ఆర్జిత సేవలను ప్రారంభించినట్లు ఆలయ ఈవో వివరించారు.
![శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆన్లైన్లో ఆర్జిత సేవలు ప్రారంభం srikalahasti](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11644680-804-11644680-1620177994120.jpg)
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పరోక్ష ఆర్జిత సేవలు ప్రారంభం