ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారం పాటు జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంట్​ రైటర్ల పెన్​ డౌన్​

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కరోనా కేసులు పెరుగుతున్నందున.. డాక్యుమెంట్ రైటర్లు వారం పాటు పెన్​ డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీనికి అధికారులతో పాటు ప్రజలు సహకరించాలని వారు కోరుతున్నారు.

document writters pen down for a week
వారం పాటు జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంట్​ రైటర్ల పెన్​ డౌన్​

By

Published : May 2, 2021, 9:39 AM IST

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డాక్యుమెంట్ రైటర్లు సోమవారం సాయంత్రం నుంచి వారం రోజల పాటు స్వచ్ఛందంగా పెన్ డౌన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల సంఘం స్టీరింగ్ కమిటీ సభ్యులు సీఎం కేశవులు ఆధ్వర్యంలో శనివారం సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్​కు వినతిపత్రం అందించారు. డాక్యుమెంట్​ రైటర్లకు సహకరించాలని ఆయనను కోరారు.

చిత్తూరు జిల్లాలోని దస్తావేజు లేఖరులు, అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లతో కలసి సుమారు 9 వేల మంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద విధులు నిర్వహిస్తున్నారని కేశవులు తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోందని, కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉన్నందున.. కట్టడిలో భాగంగా మే 3 నుంచి 9 వరకు స్వచ్ఛందంగా పెన్ డౌన్​ తో ముందుకొచ్చినట్లు తెలిపారు. ఇందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details