ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలను గోడకు బాదుకుంది... టీచరే కొట్టిందని చెప్పింది..! - తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..

కుటుంబ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఎప్పుడూ ఏడ్చేది. ఏంటని ఉపాధ్యాయురాలు అడిగితే గోడకు తలబాదుకుంది. ఇంటికెళ్లి టీచరే కొట్టిందని చెప్పి తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకొచ్చిందో విద్యార్థిని.

one-student-complaint-their-parent-to-beated-the-teacher
తల బాదుకుని టీచరే కొట్టిందని చెప్పిన విద్యార్థిని

By

Published : Dec 3, 2019, 6:07 PM IST

తలను గోడకు బాదుకుంది... టీచరే కొట్టిందని చెప్పింది..!

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని... కస్తూర్బాగాంధీ పాఠశాలలో బండారు కావేరి ఆరో తరగతి చదువుతోంది. కుటుంబ అర్థిక పరిస్థితులు బాగాలేక తల్లిదండ్రులపై బెంగతో వసతి గృహంలో ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఉండేది. విసిగిపోయిన ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థినిని మందలించి... ఇంటికి పంపించింది. ఇంటికి వెళ్లిన ఆ విద్యార్థిని ఉపాధ్యాయురాలు కొట్టిందని తలకు గాయాన్ని చూపించింది. కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు బంధువులుతో సహా పాఠశాలకు వచ్చి ధర్నా చేశారు.

పాపే తలను గోడకు బాదుకుంది...
స్పందించిన పాఠశాల అధికారి అశోక్​రావు... ఇంటిపై బెంగ, తల్లిదండ్రుల ఆర్థిక, అనారోగ్య పరిస్థితులను తలచుకుంటూ కావేరి ప్రతిరోజు ఏడుస్తుందని కుటుంబసభ్యులకు తెలిపారు. నిన్న కూడా తల్లికి ఫిట్స్ ఉందంటూ తరగతి గదిలోనే చాలా సేపు ఏడ్చిందని... ఇతర పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉపాధ్యాయురాలు మందలించిందని తెలిపారు. కోపంతో కావేరి తలను గోడకు గుద్దుకోవడం వల్ల స్వల్ప గాయమైందని... పాప ఇంటికి వెళ్తానని చెప్పగానే పంపించినట్లు తెలిపారు. గతంలోనూ కావేరి ఇలాగే చేసిందని తెలిపారు.

ఇవీ చూడండి: పశువైద్యురాలి ఘటన మరవకముందే...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details