తిరుపతి ఆటోనగర్లో రసాయన డ్రమ్మును గ్యాస్ కట్టర్తో కోస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో జయరాం అనే వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. దుకాణం వద్ద కెమికల్ డ్రమ్మును గ్యాస్ కట్టర్ సాయంతో జయరాం కోసేందుకు ప్రయత్నించాడు. డ్రమ్ములో ఇంకా రసాయనం మిగిలి ఉండటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగి... జయరాంకు అంటుకున్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మంటలను ఆర్పి, జయరాంను రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రసాయన డ్రమ్ము కోస్తుండంగా మంటలు చెలరేగి వ్యక్తికి గాయాలు - tirupathi autonagar fire accident update
రసాయన డ్రమ్మును గ్యాస్ కట్టర్తో కోస్తుండగా మంటలు చెలరేగిన ఘటనలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగింది.
![రసాయన డ్రమ్ము కోస్తుండంగా మంటలు చెలరేగి వ్యక్తికి గాయాలు one seriously injured in fire accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9932389-313-9932389-1608360723957.jpg)
అగ్నిప్రమాదం