చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం బొప్పారాజపాలెంలో.. ఓ వ్యక్తిని ఏనుగులు గాయపరిచాయి. వరి పొలాల్లో ఏనుగులు తిరుగుతుండగా.. అటువైపు వెళ్తున్న సుబ్రమణ్యంపై గజరాజులు దాడి చేసి.. గాయపరిచాయి. ఇది గుర్తించిన స్థానికులు సుబ్రమణ్యంను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం అతడిని.. తిరుపతికి తరలించారు.
ఏనుగుల దాడిలో వ్యక్తికి గాయాలు - బొప్పరాజుపాలెంలో ఏనుగులు న్యూస్
ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బొప్పారాజపాలెంలో జరిగింది. గాయపడిన వ్యక్తిని మెుదట పుత్తూరు ఆసుపత్రికి తరలించి.. అక్కడ నుంచి తిరుపతికి తరలించారు.
ఏనుగుల దాడిలో వ్యక్తికి గాయాలు
గత నెల రోజులుగా పుత్తూరు నారాయణవనం కార్వేటినగరం మండలాల్లో.. మూడు ఏనుగులు పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయని స్థానికులు వాపోయారు. ఇంత జరుగుతున్నా.. అటవీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఏనుగులను అడవుల్లోకి వెళ్లేటట్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:పుర పోరు: రెండు నగర, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు