చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్ద పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి చెన్నై వెళ్తున్న కారు, చెన్నై నుంచి తిరుపతికి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.