ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్‌ షాక్‌తో ఒకరు మృతి.. అధికారుల నిర్లక్ష్యమేనని గ్రామస్థుల ఆగ్రహం - విద్యుత్‌ షాక్‌ వార్తలు

చిత్తూరు జిల్లా వి.కోట మండలం ముదరందొడ్డి పంచాయతీ నడమంత్రం చెరువులో విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్రగాయలయ్యాయి. ఇవాళ ఉదయం బహిర్బూమికి వెళ్లిన బాలాజీ నీటిలో ఇరుక్కుపోవడంతో అతనిని కాపాడేందుకు కృష్ణప్ప ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ తీగలను పట్టుకోవటంతో ఇద్దరు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రిగా తరలించగా అప్పటికే కృష్ణప్ప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 16, 2023, 5:23 PM IST

Man dies due to electric shock in Chittoor : చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని ముదరందొడ్డి గ్రామంలోని నడమంత్రం చెరువు వద్ద విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందగా.. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన రెస్కో అధికారుల పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడంటూ ఆరోపిస్తూ... మృతదేహాన్ని సబ్ స్టేషన్ వద్దకు తరలించారు. అనంతరం గ్రామస్థులంతా కలిసి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.

చిత్తూరు జిల్లా వి.కోట మండలం ముదరందొడ్డి పంచాయతీ నడమంత్రం చెరువులో విద్యుత్ షాక్ తగిలి కృష్ణప్ప అనే వ్యక్తి మృతి చెందగా.. బాలాజీ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ఉదయం బహిర్బూమికి వెళ్లిన బాలాజీ నీటిలో ఇరుక్కుపోవడంతో అతనిని కాపాడేందుకు వెళ్లిన కృష్ణప్ప అదుపుతప్పి పక్కన ఉన్న తీగలకు తగిలి విద్యుత్ షాక్​కు గురయినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘనలో బాలాజీ ప్రాణాలతో బయట పడగా కృష్ణప్ప మృతి చెందినట్లు గ్రామస్థులు వెల్లడించారు. బాలాజీ పరిస్థితి విషమంగా ఉండటంతో అతని ఆంబులెన్స్​లో వి.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించిన గ్రామస్థులు

గత కొన్ని రోజులుగా తమ గ్రామంలో విద్యుత్ తీగలు నేలకు అందేట్లుగా ఉంటున్నాయని చెప్పినా లైన్​మెన్ పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. లైన్​మెన్ ఒక్కో విద్యుత్ స్తంభాన్ని రూ.1000 నుంచి రూ.2000 వరకు అక్రమంగా అమ్ముకుంటున్నారని వెల్లడించారు. విద్యుత్ అధికారులు సకాలంలో స్పందించి తగిన చర్యలు చేపట్టి ఉంటే ఇప్పుడు ప్రాణనష్ణం జరిగేది కాదని గ్రామస్థులు వాపోయారు. తీవ్రంగా గాయపడిన బాలాజీకి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లైన్​మెన్​ను ఘటనకు బాధ్యుడిగా చేస్తూ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మెుదట పోలీసులు బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు, పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. చివరికి గ్రామస్థులు, విద్యుత్ అధికారులతో పోలీసులు మట్లాడి ఆందోళన కార్యక్రమాలు విరమించేలా చేశారు.

మా గ్రామంలో విద్యుత్ తీగలు నేలకు తాకేవిధంగా ఉన్నాయి. గత పది సంవత్సరాలుగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇదే అంశంపై అధికారులకు గత పది సంవత్సరాలుగా పలుమార్లు విన్నవించుకున్నాం. ఈ రోజు చెరువు గట్టుకు వెళ్లి కృష్ణప్ప విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. బాలాజీ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వారిని వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే కృష్ణప్ప మృతి చెందాడు. మృతుడు కృష్ణప్పకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయాలి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వం అదుకోవాలి.-గ్రామస్థులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details