చిత్తూరు జిల్లా బండకాడలో ఓం ప్రతాప్ మృతదేహానికి శవపరీక్ష జరిగింది. ఈ ఘటనపై విచారణకు మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారిని ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది. ప్రత్యేక అధికారి, సోమల తహసీల్దార్, ఓంప్రతాప్ కుటుంబసభ్యుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించారు. సీఎంను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఓంప్రతాప్... రెండ్రోజుల క్రితం ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడటం వివాదాస్పదంగా మారింది. యువకుని మృతికి వ్యతిరేకంగా నిరసన తెలుపున్న తెదేపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడే గృహనిర్బంధం చేస్తున్నారు.
ఓం ప్రతాప్ మృతదేహానికి శవపరీక్ష పూర్తి.. - చిత్తూరు జిల్లాలో నేర వార్తలు
చిత్తూరు జిల్లా బండకాడలో ఎస్సీ యువకుడు ఓం ప్రతాప్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఓం ప్రతాప్ మృతి పట్ల నిరసన తెలుపుతున్న తెదేపా నేతలను పోలీసులు ఎక్కడిక్కడ గృహనిర్భంధం చేశారు.
om prathap dead boady reporting process in closed in chittoor dst