ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో వృద్ధుడు దారుణ హత్య - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

తిరుపతి నగరంలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గురవయ్య యాదవ్​ గొంతును కత్తితో కోసి పరారయ్యారు. స్థానికులు గురవయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.

old men murderd at chittor district
తిరుపతిలో వృద్ధుడు దారుణ హత్య

By

Published : Jun 26, 2020, 7:55 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొర్లగుంట సమీపంలోని చంద్రశేఖర్​ రెడ్డి కాలనీలో వాటర్​ ప్లాంట్​ యజమాని గురవయ్య యాదవ్​ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు. ఘటన గురించి తెలుసుకున్న తూర్పు పోలీస్ స్టేషన్ పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

మాస్క్​లు ధరించి, ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాలో నీళ్లు నింపుతున్న గురవయ్యతో​ పక్కన కూర్చుని మాటలు కలిపారని పోలీసులు తెలిపారు. కొంత సమయం మాట్లాడిన తర్వాత కత్తితో గొంతు కోసి పరారయ్యారన్నారు. తీవ్ర గాయాలైన గురవయ్యను స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్సకు నిరాకరించడంతో... రూయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 605 కరోనా కేసులు... 10 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details