శ్రీకాళహస్తి లంకమిట్ట వద్ద పూరిల్లు దగ్ధం.. వృద్ధ దంపతులు సజీవ దహనం - chittoor district news
13:40 February 08
శ్రీకాళహస్తి లంకమిట్ట వద్ద పూరిల్లు దగ్ధం.. వృద్ధ దంపతులు సజీవ దహనం
CRIME: ఆ దంపతులిద్దరూ వృద్ధులు.. చలి తట్టుకోలేక చలిమంట వేసుకున్నారు. కానీ అవే వాళ్ల ప్రాణాలు తీస్తాయని ఊహించలేకపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
శ్రీకాళహస్తి లంక మిట్టలో విషాదం చోటు చేసుకుంది. ఓ పూరి గుడిసె దగ్ధం కావడంతో వృద్ధ దంపతులు సజీవ దహనం అయ్యారు. పట్టణానికి చెందిన వెంకట ముని (85), లక్ష్మమ్మ(75)లు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సోమవారం అర్ధరాత్రి పూరిగుడిసెలో చలిమంటలు వేయడంతో ఒక్కసారిగా గుడిసెకు నిప్పు అంటుకుంది. బయటకు రాలేని పరిస్థితిలో మంటల్లో సజీవదహనం అయినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.