చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోట సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైపాస్ రోడ్డు పక్కనున్న పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారని చంద్రగిరి పోలీసులు తెలిపారు. నిందితుడిని త్వరగా అదుపులోకి తీసుకుంటామన్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి - Road accident in Chandragiri zone of Chittoor district
రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చంద్రగిరి మండలం కోట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
TAGGED:
చిత్తూరు జిల్లా తాజా వార్తలు