2006లో ఆయన జంగాలపల్లిలో స్థలం కొని ఇల్లు కట్టించారు. అధికార పార్టీ నాయకుడొకరు ఆ స్థలం తనదంటూ గత నెల 29న బలవంతగా ఇల్లు ఖాళీ చేయించి ఇంట్లోని వస్తువులను వేరే వాహనంలో తరలించి బండివాళ్ల ఊరు వద్ద పడవేశారు. దీనిపై బాధితులు యాదమరి పోలీసుస్టేషన్‌లో అప్పట్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం జరగలేదన్న వేదనతో సుందరమ్మ సరిగా ఆహారం తీసుకునేవారు కారు.
Old Woman Dies of Agony: వైకాపా నేత స్థలం లాక్కున్నారని.. వేదనతో వృద్ధురాలి మృతి - వైకాపా నేత స్థలం లాక్కున్నారని వృద్ధురాలి మృతి
Old woman dies of agony: వైకాపా నాయకుడు తమ ఇంటిని లాక్కున్నారన్న వేదనతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన.. చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లిలో జరిగింది. అధికార పార్టీ నాయకుడొకరు ఆ స్థలం తనదంటూ గత నెల 29న బలవంతంగా.. వారిని ఇల్లు ఖాళీ చేయంచారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధురాలు మరణించిందని.. కుటుంబసభ్యులు వాపోయారు.
వేదనతో వృద్ధురాలి మృతి
ఇంటి స్థలం పోయిందన్న బాధతోనే మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఆసుపత్రికి తరలించగా ఆక్కడ మరణించారని కుమారుడు వేణు తెలిపారు. ఈ విషయమై ఎస్సై ప్రతాప్‌రెడ్డిని వివరణ కోరగా, స్థల వివాదం, గొడవలపై ఇదివరకే కేసు నమోదైందని, అయితే సుందరమ్మది సహజ మరణమేనని చెప్పారు. ఘటనపై యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
TAGGED:
ap latest news