ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఒంటరిగా ఉంటున్నా..పెళ్లికూతురిని చూడండి'.. మంత్రి రోజాకు వృద్ధుడి వింత విజ్ఞప్తి

'గడప గడపకూ మన ప్రభుత్వం' అంటూ ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి రోజాకు.. వింత విజ్ఞప్తి వచ్చింది. పింఛన్ వస్తుందా అని ఓ వృద్ధుడిని మంత్రి పలకరించగా.. వస్తుందని సమాధానమిచ్చాడు. అనంతరం తాను ఒంటరిగా ఉంటున్నానని.., పెళ్లి కూతురుని చూడాలని మంత్రిని కోరారు.

మంత్రి రోజాకు వృద్ధుడి వింత విజ్ఞప్తి
మంత్రి రోజాకు వృద్ధుడి వింత విజ్ఞప్తి

By

Published : May 17, 2022, 9:01 PM IST

మంత్రి రోజాకు వృద్ధుడి వింత విజ్ఞప్తి

'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం సిరుగురాజుపాలెంలో పర్యటించిన మంత్రి రోజా.. ఓ వృద్ధుడిని పలకరించారు. పింఛన్ వస్తుందా అని ఆరా తీశారు. వస్తుందని సమాధానమిచ్చిన వృద్దుడు.. తాను ఒంటరిగా ఉంటున్నానని, పెళ్లి కూతురుని చూడాలని కోరారు. వృద్ధుడి వింత విజ్ఞప్తితో రోజా అవాక్కయ్యారు. 'పింఛను అయితే ఇవ్వగలం గానీ... పెళ్లి ఎక్కడి నుంచి చేస్తాం' అంటూ రోజా ఆక్కడినుంచి నవ్వుతూ వెళ్లిపోయారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details