ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ తాతకు భూమి మీద ఇంకా నూకలున్నాయి.. బస్సు ఈడ్చుకెళ్లినా.. బతికాడు..! - నేర వార్తలు

Old man fell under a bus and survived in AP: పల్లె వెలుగు బస్సుకింద పడిన వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వాహనదారులు, స్థానికుల అప్రమత్తతతో ఓ వృద్ధుడి ప్రాణాలు నిలిచాయి.

Old man fell under a bus
బస్సు ఈడ్చుకెళ్లినా బతికాడు

By

Published : Jan 22, 2023, 10:25 AM IST

Old man fell under a bus: చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలకే ప్రాణాలు పోతున్న ఈ రోజుల్లో ఓ వృద్ధుడు బస్సు కింద పడ్డా.. ప్రాణాలతో బయటపడ్డాడు. గమ్యస్థానానికి త్వరగా వెళ్లాలని బయలుదేరిన బస్సు డ్రైవర్ ఓపైపు... రోడ్డుపై అన్నివైపులా చూసుకోకుండా రోడ్డు దాటేందుకు వృద్ధుడు ప్రయత్నించడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు సకాలంలో స్పందించి డ్రైవర్​ను అప్రమత్తం చేయడంతో ఆ వ్యక్తి బస్సు కింద పడ్డా ప్రాణాలతో బయటపడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని వంతెన వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. చిత్తూరు నుంచి అరగొండ వెళ్లే పల్లె వెలుగు బస్సు బస్టాండు నుంచి బయటకు వస్తుండగా.. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో డ్రైవర్‌ బస్సును ఆపారు. అదే సమయంలో జీడీ నెల్లూరు మండలం బాలగంగనపల్లికి చెందిన వృద్ధుడు హుస్సేన్‌ బస్సు ఆగిందని రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. వాహనాలు కదలడంతో వృద్ధుణ్ని గమనించకుండా డ్రైవర్‌ బస్సును ముందుకు పోనిచ్చాడు. వాహనం ఢీకొట్టడంతో అక్కడే కిందపడి వాహనం కిందకు వెళ్లిపోయారు. కొద్దిదూరం ఆయనను బస్సు ఈడ్చుకెళ్లింది. వాహనదారులు, స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్‌ బస్సును నిలిపేశారు. నిర్ఘాంతపోయిన వృద్ధుణ్ని స్థానికులు బయటకు తీశారు. ప్రమాదంలో ఆయన కాలికి గాయం కావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details