కరోనా వైరస్ నియంత్రణకు చిత్తూరు జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పాలనాధికారి నారాయణ భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. అధికారులు ఆయా నియోజకవర్గ కేంద్రంలోని భవనాలను పరిశీలించి నివేదిక అందజేశారు. పీలేరు నియోజకవర్గానికి కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల బాలుర వసతి గృహ సముదాయాన్ని అధికారులు పరిశీలించారు. ముందుగా గదిని ఖాళీ చేయించి శుభ్రం చేయనున్నారు. 100 బెడ్లతో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారికి స్వీయ నియంత్రణకు ఇళ్లలో ప్రత్యేక సౌకర్యాలు లేకపోతే ఈ కేంద్రాల్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు భవనాల పరిశీలన - ఏపీలో కరోనా వైరస్ తాజా వార్తలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నియోజకవర్గానికో 100 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు.. చిత్తూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ దిశానిర్దేశంతో రంగంలోకి దిగిన అధికారులు తమ నియోజకవర్గ కేంద్రాల్లోని భవనాలను పరిశీలించారు.
corona updates in ap