చిత్తూరు జిల్లాలోని జాతీయ రహదారులపై నడుచు కుంటూ, సైకిళ్లపై వెళ్తున్న వలస కూలీలను వారి గమ్య స్థానాలకు చేర్చడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. కార్మికులను రిలీఫ్ సెంటర్లకు తరలించి భోజనం, తాగునీటి సౌకర్యం, వసతి ఏర్పాటు చేస్తున్నారు.
కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు ప్రాంతంలో వివిధ పనుల కోసం వలస వచ్చిన వారు లాక్ డౌన్ కారణంగా చిక్కుకు పోయారు. సొంత ఊరుకు వెళ్లాలని సైకిళ్ళు కొనుగోలు చేసి... ఒడిశాకు బయలుదేరారు. వీరితో పాటు కర్ణాటక నుంచి బయల్దేరి చిత్తూరు జిల్లా సరిహద్దు నంగిలి వద్దకు చేరుకున్న మధ్యప్రదేశ్ వాసులు 114 మంది, బీహార్ వాసులు 100 మంది, ఝార్ఖండ్ నుంచి 50, ఒడిశాకు చెందిన 45 మంది కూలీలను చిత్తూరు జిల్లా అధికారులు గుర్తించారు.