ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటేశ్వర స్వామి దర్శనానికి తితిదే అనుమతి - officers of ttd gave permission to devotees to visit venkateswara swamy temple

వెంకటేశ్వర స్వామి భక్తులకు తితిదే తీపికబురు చెప్పింది. కరోనా కారణంగా చిత్తూరు జిల్లాలోని శ్రీనివాసమంగారపురంలోని వెంకటేశ్వర స్వామి దర్శనాలు నిలిచిపోగా.. నేటి నుంచి కొవిడ్ నిబంధనల మేరకు దర్శనానికి అనుమతి కల్పించింది. ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ttd
ttd

By

Published : Jun 16, 2021, 4:22 PM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 16న చిత్తూరు జిల్లాలోని వేంకటేశ్వర స్వామి ఆలయం మూతపడింది. అప్పటి నుంచి స్వామివారి నిత్య కైంకర్యాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. అయితే కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు.. తితిదే అనుమతి ఇచ్చింది. అధికారులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ మేరకు అనుమతులు ఇస్తున్నట్లు తితిదే అధికారులు పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, కోరనా నిబంధనలు పాటించాలని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details