ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెళ్తున్నామనే ఆనందం వారిది.. ఉండిపోయామనే ఆవేదన వీరిది! - Officers moving migrant workers to their homes

లాక్​డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల తరలింపు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే కొంతమందిని తమ స్వస్థలాలకు చేర్చారు. మిగిలిన వారు కూడా.. తమను స్వగ్రామాలకు చేర్చాలని కోరుతున్నారు.

officers-moving-migrant-workers-to-their-homes
వెళ్తున్నామనే ఆనందం.. ఉండిపోయామనే ఆవేదన

By

Published : May 3, 2020, 12:38 PM IST

Updated : May 3, 2020, 1:06 PM IST

లాక్ డౌన్ కారణంగా చిత్తూరు జిల్లాలో చిక్కుకుపోయిన....ఇతర జిల్లాల కూలీలు, ప్రయాణికులను పంపించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని గోవిందరాజుల సత్రాలు, విష్ణునివాసం, శ్రీనివాసం సహా 5 వసతి గృహాల్లో ఉన్న వారితో పాటు... చిత్తూరు, పలమనేరు ప్రాంతాల్లో చిక్కుకున్న ఇతర జిల్లా వాసులను ఆర్టీసీ బస్సుల ద్వారా వారి వారి ప్రాంతాలకు పంపించారు. మొత్తం 15 బస్సులను ఏర్పాటు చేసి... 384 మందిని తరలించారు

పరీక్షల్లో నెగిటివ్ ఫలితం వచ్చాకే...

జిల్లా కలెక్టర్ భరత్ గుప్త ఆదేశాలతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారిని స్వస్థలాలకు పంపిస్తున్నామని తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు. శనివారం రాత్రి నుంచి తరలింపునకు శ్రీకారం చుట్టామన్నారు. వలసదారులకు, యాత్రికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే పంపుతున్నామన్నారు. ఇప్పటి వరకు మెుత్తం 301 మందిని తరలించామని చెప్పారు.

మా ఊరు పంపించండి సారూ...

వారంతా కర్నాటక రాష్ట్రానికి చెందినవారు. శుభ కార్యం కోసం కడప జిల్లా జమ్మలమడుగుకు వచ్చారు. అంతలోనే లాక్ డౌన్ ప్రారంభమైంది. ఎటూ పోలేని పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో జమ్మలమడుగులోనే బంధువుల ఇళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారు. సుమారు 40 రోజులుగా ఒకే ఇంట్లో ఉండడం చాలా ఇబ్బందిగా ఉందని బాధితులు వాపోయారు. తమను ఊరికి పంపాలని పోలీసులను వేడుకుంటున్నారు.

అదును చూసి వసూళ్లు?

కేంద్రం సూచనల మేరకు వివిధ ప్రాంతాల్లో ఉండిపోయిన వలస కూలీలను ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించి.... వీరి నుంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి వచ్చి గుంటూరు జిల్లా మేడికొండూరులో చిక్కుకున్న వారిని తరలించేందుకు ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసింది. తరలింపు బాధ్యత గ్రామ వాలంటీర్లు, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇది అదునుగా భావించిన కొందరు సిబ్బంది... అల్పాహారం, మంచినీటి సౌకర్యం కల్పిస్తామంటూ.. వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ధర వెలవెల...రైతు విలవిల!

Last Updated : May 3, 2020, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details