ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉపాధి కూలీల కుటుంబాలకు ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూడాలి' - తంబళ్లపల్లిలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తాజా వార్తలు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో ఉపాధి హామీ పనుల పెంపుపై అధికారులు సమావేశం నిర్వహించారు. భూ సంరక్షణ, భూ అభివృద్ధి, వర్షపు నీటి పరిరక్షణ, చెట్ల పెంపకం, సంరక్షణ పనులను ఉపాధి హామీ పథకంలో చేపట్టాలని నిర్ణయించారు.

Officers have held a meeting on employment guarantee work in Thamballapalli at  Chittoor district
తంబళ్లపల్లిలో ఉపాధి హామీ పనులపై అధికారుల సమావేశం

By

Published : Jun 22, 2020, 5:29 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో ఉపాధి హామీ పనుల పెంపుపై అధికారులు సమావేశం నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె నియోజకవర్గం ప్రజలకు ఉపాధి పనులతో ఊరట కల్పిస్తున్నామని ఉపాధి హామీ పథకం అధికారులు పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులు.. కిందిస్థాయి ఉద్యోగులను కోరారు. భూ సంరక్షణ, భూమి అభివృద్ధి, వర్షపు నీటి పరిరక్షణ, చెట్ల పెంపకం సంరక్షణ పనులను ఉపాధి హామీ పథకంలో చేపట్టాలని నిర్ణయించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details