ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంబళ్లపల్లిలో లబ్ధిదారుల ఇంటికే పౌష్టికాహారం

లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని చిత్తూరు జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో పౌష్టికాహార పంపిణీ ప్రారంభమైంది.

nutrition food distribution in tamballapalli
అంగన్వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేత

By

Published : Apr 18, 2020, 7:53 AM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ఐసీడీఎస్ అధికారులు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. లాక్​డౌన్ ప్రభావంతో వీరు ఇంటికే పరిమితమైనందున ఈనెల 15 నుంచి మే 3 వరకు గుడ్లు, పాలు, బియ్యం, నూనె తదితర వస్తువులను లబ్ధిదారుల ఇంటికే అందిస్తామని అధికారులు తెలిపారు. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక్కొక్కరికి 15 గుడ్లు, రెండు కిలోల బియ్యం, 400 గ్రాముల పప్పు, తల్లులకు 30 గుడ్లు, 250 మిల్లీలీటర్ల నూనె, 3 లీటర్ల పాలు, రెండు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని స్థానిక సీడీపీఓ సుజాత తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details