ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో 4 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయం - oxygen plants in AP

రాష్ట్రంలో 4 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయించింది. గుంటూరు జిల్లా రేపల్లె, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హెరిటేజ్ సీఎస్ఆర్ ఫండ్స్‌ సహకారంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్టు వెల్లడించింది.

రాష్ట్రంలో 4ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయం
రాష్ట్రంలో 4ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయం

By

Published : May 26, 2021, 8:50 PM IST

Updated : May 26, 2021, 10:22 PM IST

రాష్ట్రంలోని నాలుగు పట్టణాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయించింది. రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలి పట్టణాల్లో ప్లాంట్లు నెలకొల్పనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. హెరిటేజ్ సీఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో వీటిని ప్రారంభిస్తారు. హోమ్ ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఇప్పటికే 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఎన్టీఆర్ ట్రస్టు అందుబాటులోకి తెచ్చింది.

లోకేశ్వరరావు నేతృత్వంలోని విదేశీ వైద్యులతో టెలీమెడిసిన్ సేవలు కొనసాగిస్తూ... 24గంటలూ పనిచేసే కాల్ సెంటర్​ను అందుబాటులో ఉంచారు. కరోనా రోగులకు ఎలాంటి సాయం అవసరమున్నా... ఏ విధమైన సాయం అవసరమైనా తామున్నామంటూ ఎన్టీఆర్ ట్రస్ట్, తెలుగుదేశం కార్యకర్తలు సంయుక్తంగా జిల్లాల్లో ఉచితంగా మందులు, భోజనం, నిత్యావసర వస్తువులు తదితర సహాయాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు

ఇదీ చదవండీ... జూన్ 1 నుంచి.. తిరుమల - అలిపిరి నడక మార్గం మూసివేత!

Last Updated : May 26, 2021, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details