ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇవాళ తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్టు రక్తనిధి ప్రారంభం - chandra babu

రక్త దానం ద్వారా ఎంతో మందికి సేవలందించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో రక్తనిధి ఇవాళ తిరుపతిలో ప్రారంభం కానుంది.

రక్తనిధి

By

Published : Apr 20, 2019, 1:01 PM IST

రక్తనిధి..
రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నాల్గవ రక్తనిధిని తిరుపతిలో ఏర్పాటు చేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం నేపథ్యంలో ఇవాళ రక్తనిధిని ప్రారంభించనున్నారు. నగరంలోని ఆర్​ఆర్ కాలనీ, కోటుకొమ్మల వీధిలో ఏర్పాటు చేసిన రక్తనిధిని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి తిరుపతి విమానాశ్రయం చేరుకోనున్న ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా పద్మావతి అతిథి గృహానికి వస్తారు. సాయంత్రం 4గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్​ఆర్ కాలనీకి చేరుకొంటారు. నారాభువనేశ్వరి రక్తనిధిని ప్రారంభిస్తారు...సీఎం ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

ABOUT THE AUTHOR

...view details