స్వర్గీయ నందమూరి తారకరామ రావు జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్ లో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చిత్తూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధర్ వర్మ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తెదేపా నాయకులు, కార్యకర్తలు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి దిల్లీ గద్దెను గడగడలాడించిన పౌరుషం ఆయన సొంతమని తెదేపా నాయకులు కీర్తించారు.
ఊరుఊరున సంబరం..... అన్నగారికి నీరాజనం - nandamuri
తెలుగుదేశం వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాలను చిత్తూరు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. అన్నగారి విగ్రహాలకు అభిషేకాలు చేసి హారతులు పట్టారు.
![ఊరుఊరున సంబరం..... అన్నగారికి నీరాజనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3403845-1081-3403845-1559032212400.jpg)
అన్నగారిని గుర్తు చేసుకుంటూ..
పుత్తూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు స్థానిక తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. మున్సిపల్ ఛైర్మన్ యుగంధర్, తెదేపా అధ్యక్షుడు గణేష్ తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
హారతులు పట్టి...
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటాలకు పూజలు చేసి హారతులు పట్టారు . కొన్ని చోట్ల రోగులకు రొట్టె, పాలు పంపిణీ చేశారు. కేకులు కోసి కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిన బూనారు.