చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లి గ్రామంలో చేపట్టిన జెడ్బీఎన్ఎఫ్ఎఫ్ వ్యవసాయ పద్ధతులు ఆదర్శవంతమైనవని హైదరాబాద్ నేషనల్ రూరల్ లైవ్లీ వుడ్ మిషన్ డైరెక్టర్ రమణారెడ్డి తెలిపారు. ఈ రకం వ్యవసాయ పద్ధతులను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈటీవీ లో ప్రసారమైన ఎద్దుల వారి పల్లి ప్రకృతి వ్యవసాయం కథనాలను చూసి తంబళ్లపల్లి మండలంలో పర్యటించినట్లు చెప్పారు. గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన రమణారెడ్డి.. వివిధ రకాల పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.
చిత్తూరు జిల్లా స్థాయిలో ప్రకృతి వ్యవసాయ రంగంలో ఆదర్శ మహిళా రైతుగా గుర్తింపు తెచ్చుకున్న గుట్ట మీద పల్లె రామసుబ్బమ్మ, భాస్కర్ రెడ్డి దంపతులను అభినందించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై సమీక్షించారు. ఎదుటివారిపల్లిలోని జెడ్బీఎన్ఎఫ్ఎఫ్ రైతులతో పాటు, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులతో.. అంగన్వాడీ కార్యకర్తలు, రైతులు సాగుచేసిన పెరటి తోటలు, సూర్యమండల ఆకార కిచెన్ గార్డెన్లను పరిశీలించి అభినందించారు.