MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో ఈనెల 21న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని తెలిపారు.
ఈ వ్యవహరంలో నిన్న కరీంనగర్‌కు చెందిన న్యాయవాది, ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బంధువు.. శ్రీనివాస్‌కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయననూ కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సిట్ కార్యాలయంలో ఈనెల 21నే విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. వీరిద్దరిని సిట్ అధికారులు ఒకే సమయానికి విచారించనున్నట్లు తెలుస్తోంది.