చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం రణరంగంగా మారింది. నియోజకవర్గంలోని తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల్లో ప్రక్రియ వివాదాలకు దారితీసింది. శ్రీకాళహస్తిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులకు దిగారు. తొట్టంబేడు మండలంలోని వైకాపా కార్యకర్తలు భాజపా నేతలపై పిడిగుద్దులు కురిపించారు. దీనిపై ఆగ్రహించిన తెదేపా, భాజపా, జనసేన నేతలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. పోలీసులు ఆందోళనకారులను స్టేషన్కు తరలించారు.
శ్రీకాళహస్తిలో రణరంగంగా మారిన నామినేషన్ల పరిశీలన - శ్రీకాళహస్తిలో రణరంగంగా మారిన నామినేషన్ల పరిశీలన
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన రణరంగంగా మారింది. తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడి చేశారు. దీనికి నిరసనగా తెదేపా, భాజపా నేతలు రహదారిపై ధర్నాకు దిగారు.
శ్రీకాళహస్తిలో రణరంగంగా మారిన నామినేషన్ల పరిశీలన