ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లిలో పోటెత్తిన నామినేషన్లు.. - panchayth nominations at madhanaplli

చిత్తూరు జిల్లా మదనపల్లెలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పోటెత్తారు. పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో నామపత్రాలు సమర్పించడానికి అభ్యర్థులు తొందరపడుతున్నారు.

panchaythi elections nominations at madhanapalli
మదనపల్లిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్

By

Published : Feb 4, 2021, 3:26 PM IST

పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో అభ్యర్థులు జోరుగా నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ల నామపత్రాల సమర్పణతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలం, రామసముద్రం మండలంలో అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులతో నామినేషన్ కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. నామినేషన్ వేయడానికి చివరి రోజు కావడంతో కేంద్రాల వద్ద అభ్యర్థులు వరుసలో వేచి ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు తగిన ఏర్పాటు చేశారు.

నిమ్మనపల్లె మండలం.. సామకోటవారిపల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ఓబుల్ రెడ్డి అదృశ్యమయ్యారు. దేపా మద్దతుతో ఇవాళ నామినేషన్​ వేసేందుకు ఓబుల్​రెడ్డి సిద్ధమయ్యారు. ప్రత్యర్థులే అపహరించి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఓబుల్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: సామకోటవారిపల్లిలో... సర్పంచ్ అభ్యర్థి అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details