ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీరు లేక వెలవెలబోతున్న.. కల్యాణి డ్యామ్ - tirumala

ఓ వైపు ఎండలు.. మరో వైపు తిరుమల, తిరుపతికి నీటి పంపణీ. దీంతో శేషాచలం అడవుల్లోని కల్యాణి డ్యామ్ అడుగంటిపోతోంది. నాడు నిండుకుండను తలపించిన జలాశయం..నేడు జలకళ లేక ఎండిపోతోంది.

'నీరు లేక వెలవెలబోతున్న కల్యాణి డ్యామ్'

By

Published : Jun 22, 2019, 5:48 PM IST

'నీరు లేక వెలవెలబోతున్న కల్యాణి డ్యామ్'

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఉన్న కల్యాణి డ్యామ్ నీరు లేక వెలవెలబోతోంది. ఒకప్పుడు నిండుకుండలా కళకళాడిన జలాశయం.. ఇప్పుడు పూర్తిగా అడుగంటిపోయి కళావిహీనంగా మారింది. ఎండతీవ్రత ఒకవైపు.. తిరుపతి, తిరుమలకు నీరు పంపిణీ చేయటం మరోవైపు... ఈ రెండు వెరసి నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. నీరు లేక అడవి జంతువులు సమీప గ్రామాలలోకి వస్తూ దాడులు చేస్తున్నాయి. డ్యామ్​లో నీరు లేని కారణంగా సమీప ప్రాంతాల్లో బోర్లు, బావులకు ఊట లేక అడుగంటిపోయాయి. వర్షాలు పడితే తప్ప మరో మార్గం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు ఆదుకుంటే తప్ప తమ కష్టాలు గట్టెక్కవంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details