చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం నియోజకవర్గంలో ఖరీఫ్ పంటలు సాగుచేసే పొలాలు 39వేల హెక్టార్లు ఉన్నాయి. అయితే ఇప్పటికి అక్కడ కేవలం 5వేల హెక్టార్లలోనే విత్తనాలు వేశారు. కొందరు రైతులు దుక్కి దున్ని వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకూ వానలు సరిగ్గా పడక నిరాశచెందిన వారు.. ఇకపై వర్షాలు పడినా విత్తనాలు వేసే సమయం దాటిపోయిందని చెప్పారు. వర్షాభావంతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు వెలవెలాపోతున్నాయి. ఇక ఇక్కడే ఉండి చేసేదేం లేదని కొంతమంది అన్నదాతలు వలసలు వెళ్తున్నారు. హంద్రీ-నీవా కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తే కొంతవరకు కరవు నుంచి విముక్తి లభిస్తుందని రైతన్నలు అభిప్రాయపడ్డారు.
కరవు పొమ్మంటోంది.... పల్లె కన్నీరు పెడుతోంది.... - రైతుల
వర్షాభావంతో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కరవు తాండవం చేస్తోంది. ఖరీఫ్ సాగు సమయం దాటిపోయినా వానలు లేక రైతులు విత్తనం నాటలేదు. ఇక ఇప్పుడు వర్షాలు పడినా ఏ ప్రయోజనం ఉండదని వలస బాట పడుతున్నారు.
తంబళ్లపల్లెలో తీవ్ర వర్షాభావం.. వలసపోతున్న రైతులు