ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మే 13 నాటికి చిత్తూరులో కరోనా కేసులుండవు' - కరోనాపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

చిత్తూరు జిల్లాలో కోవిడ్ కేసులను నియంత్రించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సగానికి పైగా కరోనా బాధితులు డిశ్ఛార్జ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అలాగే రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

minister peddi reddy
minister peddi reddy

By

Published : May 2, 2020, 3:33 PM IST

మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లాలో ఈ నెల 13 నాటికి ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా ఉండే అవకాశం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కరోనా నియంత్రణపై తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్​లో నిర్వహించిన టాస్క్​ఫోర్స్ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి పాల్గొన్నారు. జిల్లాలో కోవిడ్ కేసులను నియంత్రించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని పెద్దిరెడ్డి చెప్పారు.

సగానికి పైగా కరోనా బాధితులు డిశ్ఛార్జ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రైతులు పండించిన పంట మార్కెంటింగ్ కోసం ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details