ఒకవైపు కరోనా వచ్చి ప్రజలు సతమతమవుతుంటే... ఇప్పుడు మిడతల దండు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేయబోతోందని రైతులు అందోళన చెందుతున్నారు. ఈ మిడతల దండు తమ దిశ మార్చుకుని మధ్యప్రదేశ్ వైపునకు మరలినట్లు, చిత్తూరు జిల్లా కలిగిరి కృషి విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
దక్షిణ భారతదేశానికి ఇప్పట్లో మిడతల దండు ప్రభావం ఉండబోదని వారు తెలిపారు. ఉత్తర భారతదేశంలో ఆరు రాష్ట్రాలోని పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నఈ మిడతల దండు... తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావించినప్పటికీ, అవి మహారాష్ట్ర నుంచి దిశ మార్చుకుని మధ్యప్రదేశ్ వైపునకు వెళ్లినట్లు తెలుస్తోందని తెలిపారు.