తిరుపతిలో జూన్ 29 నుంచి 15 రోజులు లాక్ డౌన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారంపై.. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీశ స్పందించారు. అవి అవాస్తవ ప్రచారాలని.. లాక్ డౌన్ విధించడం లేదని స్పష్టత నిచ్చారు.
నగరపాలక సంస్థ పేరుతో నకిలీ వార్తను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని తెలిపారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.