పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో నిత్యం వేదమంత్రోచ్చరణలు, గోవిందనామ స్మరణలతో మధ్య ఆధ్యాత్మిక వాతావరణం భక్తులు గడుపుతుంటారు. ప్రశాంత వాతావరణంలో వేలాది వాహనాలతో శబ్ధ, వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తిరుమల కొండను నో హారన్ జోన్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. తిరుమలకు వచ్చే భక్తులకు అవగాహన కల్పించడంతో పాటు... తిరుమల, తిరుపతి అద్దె వాహనదారులకు సూచనలు చేశారు. ఎస్పీ వాహన డైవర్‌తో పాటు... పలువురి అద్దె వాహనదారులచే హారన్ మోగించనని ప్రమాణం చేయించారు.
కొండలలో మారుమోగే వెంకటనాథుని గంటలను, గోవింద శ్లోకాలను వినాలని..ఆయన కోరారు. ఆధ్యాత్మకం అణువణువునా ఉండే కొండలలో శబ్ధ కాలుష్యం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.