ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

WATER PROBLEM: తాగునీటికి కటకట..రోడ్డుపై ఖాళీ బిందెలతో ఆందోళన

ఏడు నెలలుగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని చంద్రగిరి మండలం మొరవల్లి ఎస్సీ కాలనీ వాళ్లు ఆరోపించారు. రోడ్డుపై ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.

ఖాళీ బిందెలతో నిరసన
ఖాళీ బిందెలతో నిరసన

By

Published : Aug 27, 2021, 2:20 PM IST

ఏడు నెలలుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించడం లేదని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లి ఎస్సీ కాలనీవాసులు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో పూతలపట్టు-నాయుడుపేట మొరవపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

పైప్ లైన్లు పగిలిపోయాయని కుంటి సాకులు చెప్పడం తప్ప.. సమస్యను పరిష్కరించలేకపోతున్నారని మండిపడ్డారు. ఒక్క బిందె నీటి కోసం జాతీయ రహదారి, రైలు పట్టాలు దాటుకుని ప్రయాణించాల్సి వస్తోందని అన్నారు. ఇకనైనా స్పందించి మంచినీటి వసతి కల్పించాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అధికారులను హెచ్చరించారు. సమస్యను పరిష్కరించేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


ఇదీ చదవండి:తాగునీరు కావాలంటే.. అందులోకి దిగాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details